Buggana : బుగ్గన నామినేషన్ పై టీడీపీ నేతల అభ్యంతరం

నామినేషన్ లో బుగ్గన ఆస్తి వివరాలు పూర్తిగా చూపించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 04:17 PM IST

ఏపీలో నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన మొదలుపెట్టారు అధికారులు. ఈ క్రమంలో వైసీపీ నేతల తాలూకా నిమినేషన్ల ఫై టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ (YCP) తరుపున గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామిషన్ వేసిన కొడాలి నాని (Kodali Nani Nomination )..నామినేషన్ దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి పిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ ను తన క్యాంపు ఆఫీస్ గా మార్చుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. అలాగే ఆఫీస్ ను అద్దెకు ఇచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదులో జత చేసారు. తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసిన నాని..నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగానే ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath) నామినేషన్ (Nomination ) కూడా తిరస్కరించాలని టీడీపీ నేతలు అభ్యంతరం తెలియజేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ లో బుగ్గన ఆస్తి వివరాలు పూర్తిగా చూపించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. ఈ విషయాన్ని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో, డోన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బుగ్గన నామినేషన్ ను పెండింగ్ లో ఉంచారు. సాయంత్రంలోగా పూర్తి ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మరి బుగ్గన తన ఆస్థి వివరాలు తెలియజేస్తారా..? లేదా అనేది చూడాలి.

Read Also : Bumper Offer: ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన కంపెనీ.. పిల్ల‌ల చ‌దువుకు అయ్యే ఖ‌ర్చు కూడా ఇస్తుంద‌ట‌..!