YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియా సమవేశంలో వైఎస్ జగన్ పై అసహనం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల డబ్బుతో ఇష్టానుసారంగా ప్రవర్తించారన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోయిన అంశంపై బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. జగన్ కు అధికారం దూరమయ్యాక పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న. గత ప్రభుత్వంలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ విగ్రహాలకు కూడా సైతం పార్టీ రంగులు అద్దినట్లు పేర్కొన్నారు బుద్ధా. జగన్ పదవిలో ఉన్న సమయంలో అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించాడన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిని జగన్ కాపాడారని దుయ్యబట్టారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి రూ. 404 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చెప్పారని, అయితే అందులో రూ.226 కోట్లను జగన్ కాజేశారని సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపై బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన గొడవలతో టీడీపీకి సంబంధం లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు వాళ్లలో వాళ్లు కొట్టుకుని చనిపోతే టీడీపీపై జగన్ నిందలు వేశారని ఆరోపించారు.
చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చూపిస్తామన్నారు బుద్ధా వెంకన్న. సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో జగన్‌కు తెలియదన్నారు. రెచ్చగొట్టే ట్వీట్లు పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని, ఏపీకి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడని జగన్ పై విరుచుకుపడ్డారు.
Also Read: Fish Eyes: చేప కళ్ళు పడేస్తున్నారా.. అయితే ఇది తెలిస్తే అస్సలు పడేయరు!