Brother Anil : జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన బ్రదర్ అనిల్

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. మొన్నటి వరకు ఏపీలో సైలంట్‌ మోడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ (Congerss)కి ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila)ను నియమించడంతో ఆ పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబం నుంచి ఇద్దరు […]

Published By: HashtagU Telugu Desk
Brother Anil

Brother Anil

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాన పార్టీలు రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. మొన్నటి వరకు ఏపీలో సైలంట్‌ మోడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ (Congerss)కి ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila)ను నియమించడంతో ఆ పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది. అయితే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబం నుంచి ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి తలపడడం ఏపీ రాజకీయాలను మరింత హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) పొత్తుతో కొంత ఓటు బ్యాంక్‌ అధికార వైసీపీ (YCP)కి వ్యతిరేకంగా మారుతుండగా.. ఇప్పుడు బీజేపీ (BJP) సైతం టీడీపీ కూటమిలో చేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందే. అంతేకాకుండా.. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు (Chandrababu), పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)లు బీజేపీ అధిష్టానంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. ఇక రేపోమాపో టీడీపీ కూటమి ఫైనల్‌ అభ్యర్థుల లిస్ట్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న వైఎస్‌ షర్మిల ఇప్పటికే తన సోదరుడు వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆమె భర్త అనిల్ కుమార్ తన బావ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమలాపురం ఇందుపల్లిలో జరిగిన పాస్టర్ల సమావేశంలో అనిల్ కుమార్ (Brother Anil) పాల్గొని జగన్ మోహన్ రెడ్డిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డికి అందరూ ఓట్లు వేయడానికి కారణం ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) కొడుకు కావడమే. కానీ ఈ జగన్ పాలనలో సువార్త సభ (క్రైస్తవ కార్యక్రమాలు) కూడా స్వేచ్ఛగా నిర్వహించలేకపోయాం. జగన్ పాలనలో అందరూ కష్టపడుతున్నారని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.2024 ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచిన సామాజికవర్గంతో పాస్టర్ల సమావేశంలో అనిల్‌ నేరుగా సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ కుటుంబ సభ్యులు షర్మిల, వైఎస్ సునీత, బావమరిది అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేతపై ప్రత్యక్ష దాడికి దిగారు.
Read Also : BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్‌..!

  Last Updated: 11 Mar 2024, 12:06 PM IST