పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన మూవీ బ్రో (BRO). వరల్డ్ వైడ్ గా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని అంత హ్యాపీ గా ఫీల్ అయ్యారో లేదో..ఇప్పుడు బ్రో ను దెబ్బ తీసే కుట్ర మొదలైందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత కొద్దీ కాలంగా పవన్ కళ్యాణ్ నుండి సినిమా వస్తే ఏపీలోని అధికార పార్టీ (YCP) పలు నిబంధనలను తీసుకొచ్చి దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. కానీ బ్రో విషయం లో మాత్రం అలాంటివి ఏమి చేయలేదు. నిర్మాతలు సైతం టికెట్ ధరలు పెంచమని కానీ , అదనపు షోస్ , బినిఫిట్ షోస్ కావాలని ప్రభుత్వాన్ని (AP Govt) అడగడం వంటివి చేయకుండా మాములు సినిమాల మాదిరిగానే విడుదల చేసారు.
ఇక బ్రో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం , ఎలాంటి రాజకీయ గొడవలు లేకపోవడం తో ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు. కానీ సినిమాలో పబ్ సీన్లో పృద్వి వేసుకున్న టీ షర్ట్ , ఆయన క్యారెక్టర్ నేమ్ ఇప్పుడు రాజకీయ దుమారానికి తెరలేపింది. సినిమాలో కావాలనే పృద్వి (30 years Prudhvi) క్యారెక్టర్ కు శ్యామ్ బాబు అని పెట్టారని , గతంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్ పోలిన డాన్స్ సినిమాలో పెట్టారని , అంతే కాకుండా ఆ డాన్స్ లో రాంబాబు వేసుకున్న టి షర్ట్ మాదిరి షర్టే పృద్వికి వేశారని సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తూ గతంలో అంబటి రాంబాబు చేసిన డాన్స్ వీడియో ను సినిమాలో పృద్వి వీడియోను మిక్స్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ చర్చ కు దారి తీసింది. అది కాక సినిమాలో కొన్ని పవన్ (Pawan Bro Dialogues) డైలాగ్స్ ..ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పినట్లు ఉందని ప్రచారం చేస్తున్నారు.
మరోపక్క సినిమాలోని పృద్వి డాన్స్ వీడియో ట్రోల్ ఫై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ..పవన్ తనను ఎదుర్కొలేకపోతున్నారని.. అందుకే సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ సృష్టించి శునకానందం పొందుతున్నారని, గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా పలు మీడియా చానెల్స్ సైతం దీనిపై ప్రోగ్రామ్స్ ..డిబేట్ లు పెట్టి రచ్చ చేయడం మొదలుపెట్టారు. దీంతో వైసీపీ నేతలంతా ఒక్కొరిగా బయటకు వస్తూ సినిమాను వివాదంలోకి లాగడం మొదలుపెట్టారు. దీనిని గమనిస్తున్న జనసేన శ్రేణులు , అభిమానులు మాత్రం సినిమాలో కావాలని పెట్టకపోయినా..టీవీ చానెల్స్ వాళ్ల హడావిడి ఎక్కువైందని కొంతమంది అంటుంటే..మరికొంతమంది మాత్రం ఇది పక్క వైసీపీ ప్లానే అని అంటున్నారు. పవన్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని ఇలా చేస్తున్నారని వాపోతున్నారు. మరి ఈ రచ్చ సినిమాకు ప్లేస్ అవుతుందా..? మైనస్ అవుతుందా అనేది చూడాలి.
Read Also: AP @ $243 : 2027నాటికి AP 20లక్షల కోట్లకు..అమరావతితో భేషుగ్గా.!SBI నివేదిక !!