Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

Pawan Kalyan

Logo (18)

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ బలం ఒక్కసారిగా పెరిగింది. చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ రెండు పార్టీలను తానై మోస్తున్నాడు. ఈ మేరకు ఇరు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ కూడా ప్రకటించారు. ఇక తండ్రి జైలుకు వెళ్లడంతో నారా లోకేష్ మరియు కుటుంబ సభ్యులకు పవన్ అండగా నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఒవేన్ కలిశారు.

ఆంధ్రప్రదేశ్ తో బ్రిటిష్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించినట్లు బ్రిటిష్ విన్ ఒవేన్ తెలిపారు .అలాగే పవన్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్టు ఒవేన్ తెలిపారు. కాగా ఈ కీలక భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ పాల్గొన్నారు. ఈ భేటీ పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగింది.

Also Read: CWC meet in Hyderabad : హైద‌రాబాద్ లో క‌ర్ణాట‌క కాంగ్రెస్ పంచాయ‌తీ