Site icon HashtagU Telugu

Srisailam : శ్రీశైలంకు వంతెన మార్గం.. పులుల సంరక్షణ కేంద్రం పైనుంచి..

Srisailam

Srisailam

Srisailam : శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం. దీనికి దక్షిణ కాశీగానూ పేరుంది. ఈ పుణ్యక్షేత్రానికి వంతెన మార్గాన్ని (ఎలివేటెడ్‌ కారిడార్‌) నిర్మించాలని కోరుతూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ లెటర్ రాశారు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తున్నా శ్రీశైలంకు(Srisailam) రోడ్డు రవాణా రూట్ సరిగ్గా లేదని ఆ లేఖలో తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

191.1 కిలోమీటర్ల 765 నంబర్‌ నేషనల్ హైవే హైదరాబాద్‌ నగరాన్ని శ్రీశైలంతో అనుసంధానిస్తోందని మాజీ సీజేఐ తన లేఖలో చెప్పారు. ఇందులో 62.5 కిలోమీటర్ల మార్గంలో నల్లమల పులుల సంరక్షణ కేంద్రం ఉందన్నారు. నల్లమల పులుల సంరక్షణ కేంద్రం రోడ్డు వెడల్పు 5.5 మీటర్ల నుంచి 7 మీటర్లు మాత్రమే ఉందని లెటర్‌లో ఎన్‌.వి.రమణ  ప్రస్తావించారు. ఈ ఇరుకు రోడ్డు మీదుగానే రోజూ 30వేల మందికిపైగా భక్తులు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. పండగల సీజన్‌లో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందన్నారు. నల్లమల అడవి గుండా సాగే మార్గమంతా పిట్టగోడలు, ఇరుకైన వంతెనలు, ప్రమాదకర మలుపులు, లోయలు, వంపులు, ఏటవాలులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని లెటర్‌లో మాజీ సీజేఐ తెలిపారు. 62.5 కిలోమీటర్ల రోడ్డు మార్గం పులుల సంరక్షణ కేంద్రం మీదుగా వెళ్తోంది కాబట్టి.. అక్కడ వంతెనను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని తన లేఖలో మాజీ సీజేఐ ఎన్‌.వి.రమణ కోరారు. దానివల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయన్నారు.  నల్లమల అడవుల్లోని వన్యప్రాణులకు కూడా  ముప్పు తప్పుతుందని ప్రస్తావించారు.

Also Read : Abortion Right : అబార్షన్‌ ఇక మహిళల రాజ్యాంగ హక్కు

‘‘మీ (ప్రధాని మోడీ) వ్యక్తిగత చొరవ వల్లే వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ రూపుదిద్దుకొంది. మీరు చొరవ చూపితే దక్షిణ కాశీ ప్రాజెక్టు కూడా సాకారం అవుతుంది’’ అని మాజీ సీజేఐ ఎన్‌.వి.రమణ తెలిపారు. ఇదే అంశంపై 2023 ఫిబ్రవరిలో తాను రాసిన లేఖకు స్పందించిన కేంద్ర, రహదారి రవాణాశాఖ కార్యదర్శి శ్రీశైలం మార్గాన్ని మెరుగుపరిచేందుకు డీపీఆర్‌ తయారీ కోసం కన్సల్టెంట్‌ను నియమించామని మే 24న తనకు సమాధానం పంపారన్నారు. ‘‘మీరు (ప్రధాని మోడీ) మరోసారి దీనిపై దృష్టిసారించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి’’ అని ఎన్‌వీ రమణ కోరారు. శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల భక్తులకు ఈ వంతెన ప్రాజెక్టును  కానుకగా ప్రకటిస్తే సంతోషకరంగా ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆయన కోరారు.

Also Read : Maldives: భారత్‌తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు కీలక నిర్ణయం