Site icon HashtagU Telugu

YCP MLA’s: వైసీపీ సంచలనం.. ఆ నలుగురి ఎమ్మెల్యేలపై వేటు!

YCP Special status

Jagan Ycp Flag

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలిచిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తేలిపోయింది. తాజాగా శుక్ర‌వారం న‌లుగురు పార్టీ ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఎమ్మెల్యేలుగా వేటు ప‌డిన వారిలో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఉన్నారు.

ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఇటీవ‌లి కాలంలో వైసీపీ అధినాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌చ్చారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు పడింది. ఈ మేరకు మీడియా ముందుకొచ్చిన సజ్జల.. నలుగురిపై వేటు వేసినట్టు తెలిపారు. టీడీపీ ప్రలోభాల వల్లనే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని సజ్జల అన్నారు.

Exit mobile version