Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్‌.. మ‌ళ్లీ ప్రారంభం ఎప్పుడంటే..

Break to Nara Lokesh Yuvagalam Padayathra Due to Mahanadu

Break to Nara Lokesh Yuvagalam Padayathra Due to Mahanadu

టీడీపీ(TDP) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రకు బ్రేక్ ప‌డింది. గురువారం 110వ రోజు క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు(Jammalamadugu) నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ పాద‌యాత్ర సాగింది. ఉద‌యం 8.30 గంట‌ల‌కు పెద్ద‌ప‌సుపుల జంక్ష‌న్ నుంచి యాత్ర ప్రాంభ‌మైంది. జ‌మ్మ‌ల‌మ‌డుగు బైపాస్ వ‌ర‌కు సాగింది. అనంత‌రం ఆయ‌న పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చి గురువారం సాయంత్రంకు విజ‌య‌వాడ‌(Vijayawada)కు చేరుకున్నారు. విజ‌య‌వాడ‌లో టీడీపీ శ్రేణులు లోకేష్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

ఇప్పటివరకు లోకేష్ మొత్తం 1423.7 కి.మీ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను పూర్తిచేశారు. యాత్ర‌లో భాగంగా ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్ర‌తీరోజూ స్థానిక ప్ర‌జ‌ల‌తో స‌మావేశ‌మ‌వుతూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు ఈనెల 26 నుంచి 29వ తేదీ వ‌ర‌కు లోకేష్ విరామం ఇచ్చారు.

ఈనెల 27, 28 తేదీల్లో రాజ‌మండ్రిలో మ‌హానాడు-2023 జ‌ర‌గ‌నుంది. ఈ మ‌హానాడులో పాల్గొనేందుకు లోకేష్ త‌న పాద‌యాత్ర‌కు నాలుగు రోజులు విరామం ఇచ్చారు. గురువారం లోకేష్ విజ‌య‌వాడ‌కు చేరుకోగానే మ‌హానాడు ఏర్పాట్లు, క‌మిటీ ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హించారు. శుక్ర‌వారం ఉద‌యం చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరి రాజ‌మండ్రికి వెళ్ల‌నున్నారు. శ‌ని, ఆదివారాల్లో రెండు రోజులు జ‌రిగే మ‌హానాడులో వారు పాల్గోనున్నారు. మ‌హానాడు పూర్త‌యిన త‌రువాత ఒక‌రోజు విశ్రాంతి అనంత‌రం లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈనెల 30 నుంచి జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి కొన‌సాగ‌నుంది.

 

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!