Site icon HashtagU Telugu

AP : అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్…ఇదే కారణం..!!

Amaravathi

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. మూడు రాజధానుల అంశంపై ఏపీలో యుద్ధం జరుగుతోంది. అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన పాదయాత్రకు విరామం పడింది. నాలుగు రోజులపాటు విరామం ఇస్తున్నట్లు రైతులు ప్రకటించారు. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. రామచంద్రాపురం రైతుల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హైకోర్టులో తేల్చుకోవాలని రైతులు నిర్ణయించుకున్నారు. దీపావళి పండగ నేపథ్యంలో కోర్టుకు సెలువులు ఉంటడంతో…పాదయాత్రకు నాలుగు రోజులపాటు విరామం ప్రకటించారు.