గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే నల్లటి బెలూన్లు ఎగిరిపోవడంతో భద్రతా లోపం తలెత్తింది. పీఎం హెలికాప్టర్‌కు దగ్గరగా బెలూన్లు ఎగిరిపోయాయి. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేంద్రాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాజీవ్‌రతన్ నిరసనలు చేపట్టారు.
ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలతో గన్నవరం విమానాశ్రయంలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులు పట్టుకుని గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుంకర పద్మశ్రీని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే తమ చేతుల్లో ఉన్న నల్ల బెలూన్లను పగులగొట్టి ప్రధాన గేటు వద్ద కూర్చొని నిరసన తెలిపారు.
https://twitter.com/KP_Aashish/status/1543885196415553536