Site icon HashtagU Telugu

Mangalagiri : మరో రెండు నెలల్లో మంగళగిరి రూపు రేఖలు మారిపోతాయి – నారా బ్రాహ్మణి

Nara Brahmani Visit To Mangalagiri

Nara Brahmani Visit To Mangalagiri

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పర్యటనలతో రాష్ట్రం అంత సందడి సందడిగా మారింది. ఓ వైపు అధికార పార్టీ నేతలు తమ ప్రచారం మొదలుపెట్టగా..మరోపక్క ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇప్పటికే రా కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తుండగా..ఇటు నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం పేరుతో ప్రజల్లోకి వచ్చారు..ఇక ఇప్పుడు నారా బ్రాహ్మణి (Nara Brahmani) సైతం నేడు మంగళగిరి (Mangalagiri) లో పర్యటించారు.

We’re now on WhatsApp. Click to Join.

నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన లోకేష్ ..ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఆకట్టుకోగా..ఇప్పుడు నారా బ్రాహ్మణి సైతం రంగంలోకి దిగింది. ఈరోజు పట్టణంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి కేంద్రం, ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్​ను సందర్శించారు. టాటా సంస్థ తనేరా, ఎన్నారై టీడీపీ పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, తనేరా సీఈవో అంబుజ్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మిణి, మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు.

ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదన్న కార్మికులు , తమ కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువని ఆవేదన వ్యక్తంచేశారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా తమకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామని బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి అభివృద్ధి గురించే నారా లోకేష్ ఆలోచన అని ఆమె చెప్పుకొచ్చారు.

Read Also : Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్