Site icon HashtagU Telugu

Brahmani Mind Game: నారా బ్రాహ్మణి మైండ్ గేమ్

Brahmani Mind Game

Brahmani Mind Game

Brahmani Mind Game: స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండగా, ఆయన కోడలు నారా బ్రాహ్మణి చక్రం తిప్పాలని చూస్తుందని, అందులో భాగంగా నారా బ్రాహ్మణి ఆదేశాల మేరకే టీడీపీ పనిచేస్తోందని ఆరోపించారు పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల. బ్రాహ్మణి ఓ మహిళ అయి ఉండి సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అనుచిత ప్రచారానికి తెరలేపారని బండి పుణ్యశీల మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ సీఎం సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్‌లపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కాంతి రాణా టాటాకు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని పుణ్యశీల కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

సీఎం జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పారు, నారా బ్రాహ్మణి మైండ్ గేమ్‌ ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు జైల్లో ఉండగా, లోకేష్ ఢిల్లీలో ఉండగా చక్రం తిప్పేందుకు బ్రహ్మణి ప్రయత్నిస్తున్నారు. మామను మించిన కోడలుగా బ్రాహ్మణి తండ్రికి దూరమైంది. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ పార్టీని ఎక్కడ నడిపిస్తారని బ్రాహ్మణి ప్రశ్నించారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని పుణ్యశీల స్పష్టం చేశారు.

Also Read: Mangalavaram: ఆసక్తి రేపుతున్న మంగళవారం ట్రైలర్, వరుస హత్యలపై థ్రిల్లింగ్స్