Brahmani Key Role in TDP : చైత‌న్య ర‌థం ఎక్క‌నున్న బ్ర‌హ్మణి? బ‌స్సు యాత్ర షురూ!!

Brahmani Key Role in TDP :  తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త‌కాదు. రాజ‌కీయ సునామీల‌ను త‌ట్టుకుని నిలబడిన పార్టీ.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 01:25 PM IST

Brahmani Key Role in TDP :  తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త‌కాదు. రాజ‌కీయ సునామీల‌ను త‌ట్టుకుని నిలబడిన పార్టీ. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ 1982లో ప్ర‌క‌టించిన ఆ పార్టీ ఆరు నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చింది. పుట్టుక‌తోనే రికార్ట్ సాధించింది. అలాంటి రికార్డ్ ల‌ను నెల‌కొల్పుతూనే సంక్షోభాల‌ను అవ‌లీల‌గా అధిగ‌మించిన ఘ‌ట్టాలు ఎన్నో. ఇప్పుడు కూడా గ‌తం కంటే పెద్ద సంక్షోభం ఏమీ కాదు. పార్టీని న‌డిపించే నాయ‌కుల‌కు టీడీపీలో కొదువ‌లేదు.జైలులో చంద్ర‌బాబు, లోకేష్ ను పెట్టించడం ద్వారా మ‌రోఛాన్స్ కొట్టేయాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తే, అది భ్ర‌మే. ఎందుకంటే బ్ర‌హ్మిణి ప్ర‌త్యామ్నాయం క‌నిపిస్తున్నారు.

బ్ర‌హ్మిణి ప్ర‌త్యామ్నాయం (Brahmani Key Role in TDP)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (Brahmani Key Role in TDP) ఎప్పుడో చెప్పారు. కోడ‌లు బ్ర‌హ్మిణి టాలెంట్ ఎంతో. ఆమె నీడ‌న నంద‌మూరి, నారా కుటుంబాలు ఎప్పుడూ సేఫ్ గా ఉంటాయ‌ని ఇటీవ‌ల అన్ స్టాప‌బుల్ ఇంట‌ర్వ్యూలోనే వెల్ల‌డించారు. ఆమె మంచి స్పీక‌ర్, అడ్మినిస్ట్రేట‌ర్. అంతేకాదు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, బాల‌య్య నుంచి వ‌చ్చిన ఆవేశం క‌నిపిస్తున్నాయ‌ని టీడీపీ వ‌ర్గాలు న‌మ్ముతున్నారు. జైలుకు చంద్ర‌బాబు వెళ్లిన మ‌రుస‌టి రోజే తామున్నామంటూ భువ‌నేశ్వ‌రి, బ్ర‌హ్మ‌ణి ముందుకొచ్చారు. క్యాడ‌ర్ కు భ‌రోసా ఇచ్చారు.

లోకేష్ ను అరెస్ట్ చేస్తే అప్పుడు ప్లాన్ బీ కింద బ్ర‌హ్మ‌ణి అస్త్రాన్ని

ప్ర‌స్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జైలుకు వెళ్లిన చంద్ర‌బాబును బ‌య‌టకు తీసుకురావ‌డానికి న్యాయ‌కోవిదుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. జాతీయ మీడియాలో స్కిల్ డ‌వ‌లప్మెంట్ రాష్ట్రంలో ఎలా జ‌రిగింది? అనేది వివ‌రిస్తున్నారు. నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌లేద‌ని ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతున్నారు. పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగిన ఈ ప్రోగ్రామ్ కు అవినీతి మ‌ర‌క‌ను వేసి, రాజ‌కీయ కుట్ర‌కు తెర‌తీశార‌ని జాతీయ మీడియాలో బ‌ల‌మైన వాయిస్ ను వినిపిస్తున్నారు. గ‌త రెండు వారాలుగా ఆయ‌న అక్క‌డే ఉన్నారు. అయ‌న్ను కూడా అరెస్ట్ చేస్తామంటూ ఏపీ సీఐడీ తిరుగుతోంది.

Also Read : Jagan Bail anniversary : న్యాయ‌దేవ‌త‌కు గంత‌లు! జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ కు ప‌దేళ్లు..!!

స్కిల్ డ‌వ‌ల‌ప్మెంట్ తో పాటు అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, ఫైబ‌ర్ నెట్ కేసుల్లో ఇప్ప‌టికే పిటీ వారెంట్ల‌ను ఏపీ సీఐడీ జారీ చేసింది. వాటిలో లోకేష్ ను కూడా అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా వెల్ల‌డించారు. అందుకే, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. బ‌హుశా రెండు, మూడు రోజుల్లో ఆయ‌న రాష్ట్రానికి చేరుకుంటారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ఎక్క‌డ నిలిచిపోయిందో, అక్క‌డ నుంచి ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఒక వేళ పాద‌యాత్ర చేయ‌కుండా లోకేష్ ను అరెస్ట్ చేస్తే అప్పుడు ప్లాన్ బీ కింద బ్ర‌హ్మ‌ణి అస్త్రాన్ని (Brahmani Key Role in TDP) టీడీపీ సిద్ధం చేసింది.

Also Read : TDP Political Action Committee : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ రెడీ.. ఇక యుద్ధమే..

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో పార్టీని న‌డిపించేందుకు సీనియ‌ర్ల‌తో కూడిన ఒక టీమ్ ను టీడీపీ ఏర్పాటు చేసింది. ఆ టీమ్ ఇచ్చే దిశానిర్దేశం మేర‌కు పార్టీ కార్య‌క్ర‌మాలు ఉండ‌బోతున్నాయి. ఆ క్ర‌మంలో బ్ర‌హ్మ‌ణి బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఏ విధంగా 1982లో చైత‌న్యం ర‌థం ఎక్క‌డం ద్వారా సంచ‌ల‌నం సృష్టించారో, అదే త‌ర‌హాలో బ్ర‌హ్మ‌ణి బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ యువ‌గ‌ళాన్ని కంటిన్యూ చేయ‌డం కంటే చైత‌న్యం ర‌థం ఎక్కించ‌డం ద్వారా బ్ర‌హ్మ‌ణిని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేయించాల‌ని బ్లూ ప్రింట్ ను సిద్దం చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం మీద బ్ర‌హ్మ‌ణి ఆమె తాతా త‌ర‌హాలో ప్ర‌భంజ‌నం సృష్టించ‌బోతున్నార‌న్న‌మాట‌.