Site icon HashtagU Telugu

BR Ambedkar : సీఎం జగన్ నివాసానికి అతి దగ్గర్లో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం

Br Ambedkar Statue Tadepall

Br Ambedkar Statue Tadepall

ఏపీ(AP)లో దళితులకె కాదు రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు (BR Ambedkar Statue) సైతం అవమానాలు చోటుచేసుకున్నాయి. మొన్నటికి మొన్న జాతీయ జెండా ను తీసివేసి ఆ ప్లేస్ లో వైసీపీ జెండా పెట్టి ఎగురవేయడం సోషల్ మీడియా లో వైరల్ గా మారగా..తాజాగా సీఎం జగన్ (JAGAN) నివాసానికి కూతవేటు దూరంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహాన్ని కూల్చివేయడంతోపాటు చెత్తలో పడేశారు. అక్కడితో వదిలేయకుండా విగ్రహంపై లోదుస్తులు వేసి మరీ దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ (Anjireddynagar Colony) సమీపంలోని చెత్తకుప్పలో గత కొద్దీ రోజులుగా డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ విగ్రహాన్ని ఇక్కడ పడేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ విగ్రహం గురించి నాయకులు కానీ అధికారులు కానీ స్పందించడం లేదని, పలుమార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

చెత్తకుప్పల మధ్య అంబేద్కర్ విగ్రహం పడి ఉండటమే దారుణమంటే మరో అవమానకరమైన ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహంపై లోదుస్తులు వేసి దారుణంగా అవమానించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also : Chandra Mohan : చంద్రమోహన్ అంత్యక్రియలు పూర్తి