నన్ను తిట్టడంతో బీపీ పెరిగి.. అభిమానులు రియాక్షన్ చూపారు!

ఏపీలో పొలిటిక‌ల్ హీట్ రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌తిరోజు మీడియా స‌మావేశంలో ఆధారాల‌తో స‌హా చూపిస్తూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 12:49 PM IST

ఏపీలో పొలిటిక‌ల్ హీట్ రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో విచ్చ‌ల‌విడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌తిరోజు మీడియా స‌మావేశంలో ఆధారాల‌తో స‌హా చూపిస్తూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ మ‌రోసారి గంజాయి, డ్ర‌గ్స్‌పై మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర‌మైన ప‌ద‌జాలాన్ని ఆయ‌న వాడారు. దీంతో ఒక్క‌సారిగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హంతో ఊగిపోయి ప‌ట్టాభి నివాసంతో పాటూ మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడికి పాల్ప‌డ్డారు. కార్యాల‌యంలో టెక్నిక‌ల్ టీమ్ బద్రీతో పాటు అనిల్‌, విద్యాసాగ‌ర్‌ల‌పై వైసీపీ నేత‌లు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిని వీరిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

అయితే ఇదంతా త‌న‌పై టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్యాల ప‌ర్య‌వ‌సారంగానే ఆ దాడి జ‌రిగింద‌ని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  ఒక వర్గం ప్రజలు, మీడియా నిరంతరం లక్ష్యంగా చేసుకుని పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారని…ఇలాంటి అస‌భ్య‌ప‌ద‌జాలం. వాడ‌టం ప్ర‌జ‌లు ఎన్న‌డూ చూడ‌లేద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు క‌నీసం ఇలాంటి వ్యాఖ్య‌లు విన‌లేద‌న్నారు. ఇలాంటి అవ‌మాన‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు,వ్యాఖ్య‌ల‌తో ప్ర‌జ‌లు ఆగ్ర‌హానికి గుర‌వ్వ‌డంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌న్నారు.

టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయి. మంగ‌ళ‌వారం రాత్రి టీడీపీ కార్యాల‌యంలో ఐటీ ఉద్యోగి సాయి బ‌ధ్రీనాథ్ ఫిర్యాదు ఆధారంగా మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో మొద‌టి ఎఫ్ఐఆర్ న‌మోదైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు టీడీపీ కార్యాల‌యంలోకి చొర‌బ‌డి త‌న‌పై,ఇత‌ర సిబ్బందిపై దాడి చేశార‌ని బ‌ద్రీనాథ్ ఫిర్యాదు చేశారు.ఇదే ఘ‌ట‌న‌లో ఎస్ఐ నాయ‌క్‌పై టీడీపీ నేత‌లు దాడి చేశార‌ని ఆరోపిస్తూ మాజీ మంత్రి నారాలో్కేష్‌, ఆల‌పాటి రాజా,ఎమ్మెల్సీ అశోక్‌బాబుల‌పై గుంటూరు అర్బ‌న్ జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.అయితే ఓ వైపు తమ పార్టీ కార్యాల‌యాల‌పై త‌మ నేత‌ల‌పై దాడులు చేసి త‌మ‌పైనే తిరిగి కేసులు పెడుతున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేతలు పోలీసుల తీరును త‌ప్పుబ‌డుతున్నారు.భ‌విష్య‌త్‌లో పోలీసులు ఈ త‌ప్పుల‌న్నింటికి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని నేత‌లు హెచ్చ‌రించారు.