MLC: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణం

అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Botsa Satyanarayana sworn in as MLC

Botsa Satyanarayana sworn in as MLC

MLC: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన మాజీమంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చే బుధవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. చైర్మన్ ఛాంబర్‌లో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం విజయరాజు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసీసీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని బొత్స తెలిపారు. అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిందని, అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దామని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేవలం 75రోజులు మాత్రమే పూర్తి అయిందన్నారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం తమ పార్టీది మూడు రాజధానుల విధానమే అని బొత్స క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ విధానం మారితే చెప్తామన్నారు. దీంతో ఓవైపు అమరావతి రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్నా వైసీపీ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు బొత్స తేల్చిచెప్పేశారు.

Read Also: YCP : వైసీపీ కార్యాలయానికి నోటీసులు

 

  Last Updated: 21 Aug 2024, 05:02 PM IST