Site icon HashtagU Telugu

Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీల‌క వ్యాఖ్య‌లు..!

Botsa Satyanarayana Ap Electricity Charges Hike

Botsa Satyanarayana Ap Electricity Charges Hike

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వెల్లడించారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని బొత్స అన్నారు.

ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత భూములే కాకుండా, గ్రామకంఠాలు భూములను సర్వే చేస్తున్నామని, దీంతో మరో 100 ఏళ్ల వరకు భూములపై ఏ విధమైన సమస్యలు లేకుండా చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. చంద్రబాబు హ‌యాంలో ఎన్నో సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేసిన బొత్స‌.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న బొత్స‌, ప‌లు కీల‌క‌ ప్రతిపాదనలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు.

ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ తమ వద్ద లెక్కలున్నాయని ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. ఇక బషీరాబాగ్‌లో కాల్పులు చంద్రబాబు హయాంలోనే జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, రాష్ట్రంలో అనేక‌మంది రైతులు చ‌నిపోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌ 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు రాష్ట్ర‌ ప్రభుత్వానికి ఏదైనా మంచి సలహా, లేదా మంచి సూచనలు ఇస్తే బాగుంటుందని బొత్సా స‌త్య నారాయ‌ణ‌ కోరారు. ఇక పీఆర్సీ ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలన చేస్తుద‌ని, ఈ విష‌యం పై రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంద‌ని బొత్స స‌త్యానారాయ‌ణ తెలిపారు.