Botsa Satyanarayana: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల బరిలో దిగిన బొత్స సత్యనారాయణ ఓటమిపాలయ్యారు. అయితే మూడు నెలలకే ఆయనకు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ కేటాయించి వైసీపీలో సముచిత స్థానం కల్పించారు. కాగా నేడు ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారానికి ముందు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు బొత్స సత్యనారాయణ.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. అభ్యర్థిత్వానికి సంబంధించి కూటమి నుండి మొదట సంకోచాలు ఉన్నప్పటికీ, వైఎస్‌ఆర్‌సిపి బొత్సకు మద్దతుగా నిలిచింది, ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయానికి దారితీసింది. ఈ సమావేశం అనంతరం కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల బరిలో దిగిన బొత్స కుటుంబం ఓడిపోయింది. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకటరావు చేతిలో ఆయన ఓటమి చెందారు. ఇక బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ చేతిలో ఓడారు. అలాగే బొత్స సోదరుడు అప్పలనర్సయ్య గజపతి నగరం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందాడు.
Also Read: CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు