ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ప్రతిపక్షాలు చేసేదేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రతిధ్వనించారు, వారు మంచి పనితీరు కనబరిచినట్లయితే మరొక అవకాశం అడగడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నామని మంత్రి సమర్థించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వక్రీకరణ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ చంద్రబాబు రాజధానిని వదులుకుని ప్రస్తుత పరిస్థితిని సృష్టించారని విమర్శించారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని, పనితీరు చూసి ఓట్లు అడగడం వంటి జిమ్మిక్కులు తమకు అవసరం లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న చౌకబారు వ్యాఖ్యలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఉద్యోగులతో ఇప్పటికే చర్చలు జరిపామని, వచ్చే నెలలో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని మంత్రి బొత్స మీడియాకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాకుండా.. ప్రజారాజ్యం విలీనం, చిరంజీవి(Chiranjeevi) రాజకీయ ప్రస్థానం గురించి మంత్రి బొత్స మాట్లాడుతూ… ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవారని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనకు ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు.. చిరంజీవి అడ్డుకున్నారని మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనకు, తన కుటుంబానికి తప్ప ఇంకెవరికీ సీఎం ఛాన్స్ దక్కకూడదనే మనస్తత్వం ఉండేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత చిరంజీవికి కాంగ్రెస్ కండువా కప్పి తానే పార్టీలోకి ఆహ్వానించానని, అప్పట్లో తాను సీఎం అయ్యి ఉంటే తన సామాజిక వర్గానికి న్యాయం చేసేవాడినని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. ఈ సందర్భంగా… త్వరలోనే విభజన సమయంలో జరిగిన సంఘటనలపై ఒక పుస్తకం రాయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ వ్యూహాత్మకంగానే చిరంజీవి పేరు ప్రస్తావిస్తోందనంటున్న విశ్లేషకులు… రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి గురించి మంత్రి బొత్స వ్యాఖ్యానించడం వెనుక అర్థం వేరే ఉందనే ఊహాగానాలు వెలిబుచ్చుతున్నారు.
Read Also : Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్