Site icon HashtagU Telugu

AP : బొత్స ఫై గంటా పోటీ..? టీడీపీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?

Botsa Ganta

Botsa Ganta

ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే క్రమంలో వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం..మరోపక్క వైసీపీ 175 కు 175 సాధించాలని కసరత్తులు చేయడం..అభ్యర్థుల ఎంపికలో సరికొత్త ఆలోచనలు చేస్తుండడం తో అందరిలో ఈసారి గెలుపు ఎవర్ని వరిస్తుందో అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లి (Cheepurupalli)లో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas)ను బరిలోకి దింపాలని టీడిపి (TDP) చూస్తుంది. చీపురుపల్లిలో బొత్స నాల్గు సార్లు బరిలోకి దిగగా.. మూడుసార్లు విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా అదే స్థానం నుండి బరిలోకి దిగబోతున్నాడు. ఇక గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే..ఈయన ఎక్కడి నుండి పోటీ చేసిన విజయం అనేది వారిస్తూ వస్తుంది. 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా ప్రతి చోట విజయం సాధిస్తూ ఉండడం తో..ఈసారి బొత్స ఫై పోటీ చేయాలనీ టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నాడు. ఇప్పటికే దీనిపై కసరత్తులు చేశారట. అక్కడి ప్రజలంతా గంటా అయితే బాగుంటుందని..ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం అని చెప్పుకొచ్చారట. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ కి మంచి పట్టు ఉంది. 1983 నుండి 1999 వరకు వరుసగా సైకిల్ విజయాత్ర కొనసాగింది. ఇలా టీడీపీ అక్కడ మంచి గ్రాఫ్ ఉండడం తో..ఈసారి గంటాను బరిలోకి దింపాలని చంద్రబాబు సైతం ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టీడీపీ వర్గాలు చెపుతున్నారు.

Read Also : Drink Water: ఆహారం తిన్న 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు..?