Botsa Laxman Rao Ready To Joins Janasena : వైసీపీ నేతల (YCP Leaders) దారి ‘జనసేన కే’..అని తెలుస్తుంది. ఒకరి తర్వాత ఒకరు మీము చేరుతున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. మొన్నటి వరకు 21 మంది తో ఉన్న గ్లాస్ (Janasena)..త్వరలో 100 దాటేలా ఉందని అంత మాట్లాడుకుంటున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన దెబ్బకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్ కు (Jagan)..ఇక ఇప్పుడు పార్టీ నేతలు ఇస్తున్న షాకులకు ఏంచేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితికి వెళ్లిపోయాడు. ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వరుసపెట్టి నేతలు బయటకు వస్తున్నారు. ఈ మధ్య చాలామంది నేతలు వైసీపీ కి రాజీనామా చేసి , టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు జనసేన దారిపడుతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన లో చేరబోతున్నట్లు ప్రకటించగా..ఇప్పుడు బొత్స సోదరుడు సైతం జనసేన లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు (Botsa Laxman Rao) పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ, సోదరుడితో ఉంటే లైఫ్ ఉండదని భావించారో ఏమో తెలీదుగానీ, ఫ్యాన్ పార్టీకి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరు మూడున జనసేన పార్టీలోకి చేరాలని డిసైడ్ అయ్యాడట..ఇప్పటీకే తన అనుచరులకు ఈ విషయాన్ని తెలిపాడని సమాచారం.
2019 ఎన్నికల్లో వైసీపీ విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ చేయడానికి బొత్స సత్తిబాబు ఫ్యామిలీ ఎంతో కృషి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. తమ్ముడు అప్పలనరసయ్య, లక్ష్మణరావు మేనల్లుడు చిన్న శ్రీను ఎవరి ప్రయత్నాలు వారు చేశారు సక్సెస్ అయ్యారు. బొత్స మంత్రి కాగా, అప్పల నర్సయ్య ఎమ్మెల్యే అయ్యాడు, మేనల్లుడు జెడ్పీ ఛైర్మన్ అయ్యారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. బొత్స ఫ్యామిలీలో అంతర్గత చిచ్చు మొదలుకావడం తో..జనసేనలోకి చేరాలని లక్ష్మణరావు డిసైడ్ అయ్యాడట. ఇప్పుడు చేరితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచన ఆయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. మరోపక్క విశాఖపట్నంలో కూడా వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ ఛైర్మన్ ఎస్‌ఏ రెహ్మాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం మంచి అడుగులు వేస్తోందని ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇలా మొత్తం మీద వైసీపీ నేతలంతా బయటకు వాస్తు తమ రాజకీయ భవిష్యత్ ప్లాన్ చేసుకుంటున్నారు.
Read Also : Air Travel : 50 నిమిషాలు పెరగనున్న ఫ్లైట్ జర్నీ టైం.. ఎందుకు ?