Site icon HashtagU Telugu

TDP Leaders’ Atrocities : రాష్ట్రంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ బొత్స ఆవేదన

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చగా మారాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్నప్పటికీ, వాటిని ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

Romantic Stunt : బైక్ పై రొమాంటిక్ స్టంట్ .. రూ. 50వేల ఫైన్ కట్టెల చేసింది !!

ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేకంగా పెన్షన్ల కోసం దివ్యాంగులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు సమయానికి అందించామని, ఇప్పుడు మాత్రం ప్రజల కష్టాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు.

అలాగే విశాఖ ఉక్కు కర్మాగారంపై కూడా బొత్స స్పందించారు. స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాలను ప్రైవేటీకరణ చేశారని, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేలా చేయడం అనేది పెద్ద నేరమని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తీరు ప్రదర్శించాలని సూచించారు.