Site icon HashtagU Telugu

AP : టీడీపీ-జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ గోతి కాడ నక్కలా ఎదురుచూస్తుంది – బొండా ఉమ

Chandrababu Offer To Pawan

Chandrababu Offer To Pawan

టీడీపీ – జనసేన కూటమిలో టికెట్ల ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయి అని..దీనికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్లే అని , నాలుగు రోజులు ఆగండి… టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు అంటూ వైసీపీ నేతలు వారి స్టయిల్ లో మాటల యుద్ధం మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా వరుసపెట్టి పవన్ చేసిన కామెంట్స్ ఫై మాట్లాడుతూ..ప్రజలను మరింత అయోమయంలో పడేయడం..కూటమి చీలిపోతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పడం మొదలుపెట్టారు. దీనిపై టీడీపీ నేత బొండా ఉమ స్పందించారు.

పవన్ రెండు సీట్లను ప్రకటించడంపై తమకేం ఇబ్బంది లేదని బొండా ఉమ అన్నారు. టీడీపీ-జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ గోతి కాడ నక్కలా ఎదురుచూస్తోందని మండిపడ్డారు. ‘పవన్ కామెంట్లలో తప్పేం లేదు. మా మధ్య సీట్ల షేరింగ్ దాదాపు ఫైనల్ అయింది. జనసేన సీట్లనే ఆయన ప్రకటించారు. మాది పవిత్రమైన పొత్తు. కొన్ని సీట్లు ప్రకటించాలనుకున్నారు, ప్రకటించేశారు. మాకు లేని బాధ వైసీపీకి ఎందుకు’ అని ప్రశ్నించారు.

అసలు ఏంజరిగిందంటే..

రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించగా..నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం తమ పార్టీ నుండి మొదటి రెండు స్థానాలను ప్రకటించారు. రాజోలు (Rajool ), రాజానగరం (Rajanagaram) నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నట్లు తెలిపి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘ఆర్’ అక్షరం తనకు బాగా నచ్చుతుందని ప్రకటించిన ఆయన… రిపబ్లిక్ డే రోజున జనసేన పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాల పేర్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్త ధర్మం ప్రకారం టీడీపి వాళ్ళు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. కానీ, మండపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, దీనిపై మండపేట జనసేన నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా వారితో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.

చంద్రబాబుకు ఏ విధమైన ఒత్తిడి ఉంటుందో, అలాంటి ఒత్తిడి తనకు కూడా ఉంటుందని, అందువల్లే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాజోలు, రాజనగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. దీనిని టీడీపీ అర్థం చేసుకుంటుందని పవన్ చెప్పుకొచ్చారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని.. కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా తప్పవన్నారు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లను తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని.. భవిషత్‌లో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమిని గెలిపించాలని పవన్ కోరారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని తెలిపారు. పార్టీ లో అందరికి న్యాయం జరుగుతుందని..మీకు భరోసా నేను ఇస్తున్నానని …నన్ను నమ్మండి అంటూ పవన్ పార్టీ నేతలకు , కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ అంశం పట్ల వైసీపీ మరోవిధంగా ప్రచారం మొదలుపెట్టింది. నాలుగు రోజులు ఆగండి… టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు అంటూ వారి స్టయిల్ లో మాటల యుద్ధం మొదలుపెట్టారు.

Read Also : Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు