Site icon HashtagU Telugu

TDP : మైల‌వ‌రంలో బొమ్మ‌సాని ఆత్మీయ స‌మావేశం.. టికెట్ త‌న‌కే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోర‌ని బొమ్మ‌సాని

Bommasani subbarao

Bommasani subbarao

మైల‌వ‌రంలో టీడీపీ నేత బొమ్మ‌సాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం నిర్వ‌హించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తే ఘోరంగా ఓడిపోతారనే టాక్ క్యాడ‌ర్‌లోనే వినిపిస్తుంది. త‌న వెంట తిరిగే వాళ్ల‌ను కూడా ఉమా ఇబ్బందుల‌కు గురి చేశాడ‌నే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్థానికుల‌కే టికెట్ ఇవ్వాలంటూ ఇప్ప‌టికే డిమాండ్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ సీనియ‌ర్ నేత బొమ్మ‌సాని సుబ్బారావు ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఇది బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న గానే క‌నిపిస్తుంది. స‌మావేశానికి పెద్ద సంఖ్య లో టీడీపీ , జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ బలోపేతం కోసం ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించామ‌ని బొమ్మ‌సాని సుబ్బారావు తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశామ‌ని.. కానీ వైసీపీ ప్రభుత్వంలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలు గా నాశనం చేశారని.. యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమ‌ని.. జన సేన పవన్ కళ్యాణ్ ప్రజా స్వామ్యన్ని కాపాడాలని టీడీపీ పార్టీ తో జత కట్టారన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని..త‌న ఇంటి వద్దకు సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడు ఏ పార్టీ అని ఎప్పుడు చూడ‌కుండా సహాయం చేసేవాడిని అని తెలిపారు. త‌న‌ను మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఎంపిక చేయాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నానని.. అంతిమ నిర్ణయం చంద్రబాబుదేన‌న్నారు.ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబ‌డి ఉంటానని బొమ్మ‌సాని తెలిపారు.ఈ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని.. ఇబ్రహీంపట్నం లో ఫ్లై యాష్ నీ అధికార పార్టీ నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. థ‌ర్మల్ పవర్ స్టేషన్ పోల్ల్యూషన్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.త‌న‌ను ఇబ్బందులు కల్పించడానికి కొంత మంది ఎన్నో కుట్రలు పన్నుతున్నారని కానీ ఎవరికి సీటు ఇచ్చినా తాను వారి కోసం పని చేస్తానని వెల్ల‌డించారు. ఐదవ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించాలని ఇరవై రోజులు ముందే అనుకున్నాన‌ని.. పార్టీ పెద్దలు ఈ మీటింగ్ ఆపమని రాత్రి త‌న‌కు చెప్పార‌ని.. కానీ కార్యకర్తలు నొప్పించకుడద‌ని ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌ని తెలిపారు.

Also Read:  TDP : సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా.. కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు