Site icon HashtagU Telugu

Raa Kadali ra : చంద్రబాబు సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

Bomb Squad Inspection In Chintalapudi

Bomb Squad Inspection In Chintalapudi

చింతలపూడి: టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ‘రా.. కదలిరా’ (Raa Kadali ra) సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు (Bomb squad Inspections) చేపట్టారు. హెలిప్యాడ్‌ ప్రాంతంలో సిగ్నల్‌ బజర్‌ మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రావాల్సి ఉంది.

ఏపీలో రెండుమూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే 17 లోక్ సభ స్థానాల పరిధిలో చంద్రబాబు సభలు నిర్వహించారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇటీవల కొంత విరామం తీసుకున్న చంద్రబాబు.. మళ్లీ సోమవారం నుంచి రెండ్రోజుల పాటు రా కదలిరా సభలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో సోమవారం అనకాపల్లి జిల్లా మాడుగుల, ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా చింతలపూడిలో టిడిపి అధినేత చంద్రబాబు రా కదలి రా సభలో పాల్గొనాల్సి ఉంది. సభాస్థలి వద్ద బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది. సభా స్థలి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. తనికీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగడంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు కంగుతిన్నారు. వెంటనే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది. తవ్వకాల్లో ఐరన్ రాడ్ బయటపడడంతో ఒక్కసారిగా అధికారులు, టిడిపి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

చింతలపూడి సభ వద్ద హెలిఫ్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు. అనకాపల్లిలో రా కదలిరా సభను పూర్తిచేసుకొని వచ్చే సమయానికి హెలిప్యాడ్ ను సిద్ధం చేసి చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.

Read Also : Honey for Face: ముఖంపై నల్లటి మచ్చలు మాయం అవ్వాలంటే తేనెలో ఇవి కలిపి రాస్తే చాలు?