విజయవాడ నగరంలోని బీసెంట్ రోడ్డు (Besant Road)లో బాంబు (Bomb ) ఉందనే వచ్చిన ఫోన్ కాల్ స్థానికులలో తీవ్ర కలకలం రేపింది. ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. దుకాణాలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయడమేకాకుండా ట్రాఫిక్‌ను కూడా మళ్లించడం జరిగింది.
The Maoists: మావోయిస్టుల గమ్యం,గమనం !
ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుతున్న తరుణంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్, పాక్ తో ఉద్రిక్తత వాతావరణం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈ ఫోన్ కాల్ వెనుక కుట్ర కోణం ఉందేమోనన్న అనుమానంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇది కేవలం భయపెట్టేందుకు చేసిన పని కాకుండా ఉగ్ర కార్యకలాపాలకు సంకేతంగా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మరోవైపు విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్రలో నిందితులుగా ఉన్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ మరియు సయ్యద్ సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు హైదరాబాద్‌లో పేలుళ్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని, విదేశీ హ్యాండ్లర్ మార్గదర్శకత్వంలో ఉగ్రవాద భావజాలాన్ని అంగీకరించారు. వీరు రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించారని తెలుస్తోంది. ఎన్ఐఏ వీరిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతుంది. వారి నివాసాల్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.