Andhra Pradesh: ఏపీకి జవాన్ గోపరాజు మృతదేహం

ఆంధ్రపరదేశ్ బాపట్లకు చెందిన ఆర్మీ జవాను గోపరాజు గుండెపోటుతో మృతి చెందారు.ప్రస్తుతం ఆయన మృతదేశాన్ని ఏపీకి తీసుకొస్తున్నారు.

Andhra Pradesh: ఆంధ్రపరదేశ్ బాపట్లకు చెందిన ఆర్మీ జవాను గోపరాజు గుండెపోటుతో మృతి చెందారు.ప్రస్తుతం ఆయన మృతదేశాన్ని ఏపీకి తీసుకొస్తున్నారు. ముందుగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నగరంలో ఘనంగా నివాళి అర్పించి ప్రస్తుతం అతని మృతదేశాన్ని ఏపీకి తరలిస్తున్నారు.

రాజస్థాన్‌లో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన భారత ఆర్మీకి చెందిన లాన్స్ నాయక్ పురమా గోపరాజు భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం సికింద్రాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రిలో పూలమాల వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మరణించిన సైనికుడికి సీనియర్ ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. మృతదేహాన్ని మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోలకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

25 ఏళ్ల గోపరాజు గత ఏడేళ్లుగా భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. ఆయన ఆకస్మిక మృతి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గోపరాజు నలుగురు తోబుట్టువులలో చిన్నవాడు. అక్క సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో పనిచేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఆర్మీలో చేరగా, మరో ఇద్దరు అన్నదమ్ములు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.

Also Read: Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు