Blue Sea Dragon and Blue Button : విశాఖ తీరంలో వింత జీవులు..తాకద్దంటూ హెచ్చరిస్తున్న నిపుణులు

సముద్రంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. వీటిలో కొన్ని చాల అరుదుగా ఉండేవి ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి

Published By: HashtagU Telugu Desk
Beware The Blue Sea Dragons

Beware The Blue Sea Dragons

విశాఖ (Vizag Beach) తీరంలో వింత జీవులు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి జీవులు బీచ్ లో కనిపించకపోయేసరికి జాలర్లు , పర్యటకులు వీటిని చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే చూడండి కానీ ఎట్టి పరిస్థితిల్లో వాటిని తాకొద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. వీటిలో కొన్ని చాల అరుదుగా ఉండేవి ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి. అలాంటి జీవుల్లో ది బ్లూ బటన్, ది బ్లూ సీ డ్రాగన్ (Blue Sea Dragon and Blue Button) లు. ఇవి చాల రేర్ గా కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి ఈ రెండు జీవులు తాజాగా వైజాగ్ సముద్రతీరంలో కనిపించాయి. ఇప్పటివరకు ఇలాంటి జీవులు కనిపించకపోయేసరికి చాలామంది వీటిని చూసేందుకు పోటీ పడుతున్నారు. ది బ్లూ సీ డ్రాగన్‌ను మముద్రపు బల్లులు అని తెలుగులో పిలుస్తుంటారు. ఇది కుడితే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ది బ్లూ సీ బటన్ శాస్త్రీయ నామం పోర్పిటా పోర్పిటా. ఇది ఒక జీవి కాదు, హైడ్రోయిడ్స్ అని పిలువబడే అనేక చిన్న జీవుల కాలనీ. ఇవి తరుచుగా విశాఖ ఆర్ కే బీచ్‌లో కన్పిస్తున్నాయి. వాటిని ప్రజలు తాకవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని తాకితే వికారం, నొప్పి, వాంతులు, చర్మ సంబంధిత లాంటి ఇతర వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటి చూస్తే దూరం నుండే చూడండి అని ఎట్టి పరిస్థితుల్లో తాకే ప్రయత్నం చెయ్యండి అని అంటున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : Purandeswari : ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి పురంధేశ్వరి లేఖ..

  Last Updated: 13 Apr 2024, 05:03 PM IST