ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వైద్యరంగంలో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme) క్రింద, వైద్య సేవల చేరువలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి, ఏమ్స్ (AIIMS) లో డ్రోన్ సేవలను (Drone services) ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎయిమ్స్ ఆసుపత్రుల్లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణలో బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రుల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రయోగాత్మక ప్రయత్నం ద్వారా వైద్యరంగంలో అత్యవసర సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందించేందుకు డ్రోన్ల వాడకాన్ని పరిశీలిస్తున్నారు.
ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ (Mangalagiri AIIMS) నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) డ్రోన్ ద్వారా రక్త నమూనా సేకరణ కోసం ప్రయోగించారు. మహిళా రోగి బ్లడ్ శాంపిలు సేకరించిన అనంతరం డ్రోన్ తిరిగి ఎయిమ్స్‌కు చేరుకుంది.
వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి, డ్రోన్ల వాడకం పై ఈ ప్రయోగాన్ని చేపట్టారని అధికారులు తెలిపారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ సేవలను పరీక్షించగా, భవిష్యత్‌లో పల్లెలు, పట్టణాల వరకు వైద్య సదుపాయాలను మరింత సమర్థంగా అందించే అవకాశం ఉంది.
Read Also : Naeem Qassem : హెజ్‌బొల్లా నూతన చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ నియమాకం