AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్

కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.

  • Written By:
  • Publish Date - January 10, 2022 / 09:20 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.
ఆ దాడిలో పాల్గొన్న అందరి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది కడప జిల్లాలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి తో పాటు ఇతర నేతలను సోము వీర్రాజు,ఎంపీలు సిఎం రమేష్,టీజీ వెంకటేష్ పరామర్శించారు.
సోమవారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్,ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి మెమోరాండం సమర్పించారు.
ఆత్మకూరులో బీజేపీ నంద్యాల అధ్యక్షులు బిడ్డా శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలిపారు.
ఈ సంఘటనను శాంతి భద్రతల సమస్యగా బీజేపీ తీసుకుంది. పోలీసులు వైకాపా తొత్తులుగా మారడం వలననే రాష్ట్రంలో హిందువులపైన హిందూ దేవాలయాలపైన ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ రెండున్నర సంవత్సరాలలో ప్రభుత్వం ఏది చెబితే అది చేసేలా పోలీసులు తయారయ్యారని బీజేపీ ఫైర్ అవుతుంది. ఆత్మకూరు సంఘటన చూస్తే మనం భారత దేశంలో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా అని డౌట్ వస్తుందని ఆ పార్టీ ఆందోళన చెందింది. సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఏమిచర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
భాజాపా నాయకులు అక్కడికి వెళ్తే హౌస్ అరెస్టు చేశారని, అదే వై.సి.పి నాయకులు అంజాద్ బాషా, కర్నూలు కు చెందిన నాయకులు కొందరు వెళ్ళి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు., రెండు మూడు వేలమంది కలిసి పోలీసు స్టేషన్ ను తగలబెట్టి నాశనం చేస్తే వారిపై కేసు పెట్టకుండా బి‌జే‌పి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై కేసుపెట్టడమేమిటి? అంటూ వీర్రాజు నిలదీశారు.
వివాదాస్పద కట్టడం గురించి పోలీసు వారిని సంప్రదిస్తే, వారు ఆ స్థలాన్ని చూస్తుంటే వారిపైనే మారణాయుధాలతో ఎటాక్ చేయటం దారుణమని అన్నారు
బాదితుడైన శ్రీకాంత్ రెడ్డి పై 307 సెక్షన్ పెట్టి కడప జైలుకు తరలించడం ఏమిటి?
ఈ సంఘటన గురించి ప్రభుత్వం నుండి కానీ ముఖ్యమంత్రి నుండి కానీ ఎలాంటి స్పందనా లేదు. కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని , జరిగిన సంఘటనపై కేంద్రానికి ఏపీ బీజేపీ తెలిపింది.