BJP Strategy : ఏపీలో BJP స‌భ‌లు! జ‌న‌సేన‌కు హ్యాండ్‌! పొత్తుపై షా,న‌డ్డా ఎత్తుగ‌డ‌!

బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతోన్న వేళ ఏపీ మీద ఆ పార్టీ(BJP Strategy) క‌న్నేసింది. తొమ్మిదేళ్ల మోడీ పాల‌న స‌భ‌ల‌ను ఏపీలోనూ నిర్వ‌హిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 10, 2023 / 01:06 PM IST

దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతోన్న వేళ ఏపీ మీద ఆ పార్టీ(BJP Strategy) క‌న్నేసింది. తొమ్మిదేళ్ల మోడీ పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా పెడుతోన్న స‌భ‌ల‌ను ఏపీలోనూ నిర్వ‌హిస్తున్నారు. ఆ క్ర‌మంలో తిరుప‌తి (Tirupathi)స‌భ‌కు భారీ ఏర్పాట్ల‌ను క‌మ‌ల‌నాథులు చేశారు. ఇక ఈనెల 11వ తేదీ న విశాఖ(Visakhapatnam) కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ రెండు స‌భ‌ల‌ను సూప‌ర్ హిట్ చేయ‌డం ద్వారా ఏపీలో ఉనికి చాటుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే, జ‌న‌సేన(Janasena) పార్టీ ఈ రెండు స‌భ‌ల‌కు దూరంగా ఉంచ‌డం హైలెట్ పాయింట్.

తిరుప‌తి స‌భ‌కు  క‌మ‌ల‌నాథులు భారీ ఏర్పాట్ల‌ను (BJP Strategy)

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు(BJP Strategy) ఉంది. ఆ విష‌యాన్ని ఆ రెండు పార్టీలు చెబుతుంటాయి. కానీ, ఎప్పుడూ కార్య‌క్ర‌మాల‌ను ఒకే వేదిక మీద నిర్వ‌హించ‌లేదు. విచిత్ర‌మైన రాజకీయ పొత్తును బీజేపీ, జ‌న‌సేన కొన‌సాగిస్తున్నాయి. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేశాయి. అయిన‌ప్ప‌టికీ డిపాజిట్ల ఆ రెండు పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌కు రాలేదు. ఇక బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఆ రెండు చోట్ల బీజేపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగారు. జ‌న‌సేన మాత్రం దూరంగా ఉంది. ఇలా గ‌త నాలుగేళ్లుగా బీజేపీ(BJP), జ‌న‌సేన(Janasena) పొత్తు న‌వ్వుల పాల‌వుతోంది. కానీ, పొత్తు మాత్రం ఉంద‌ని చెబుతుంటారు. ఢిల్లీ బీజేపీతో పొత్తు ఉంద‌ని ప‌వ‌న్ సినిమా స్టైల్ డైలాగు వేస్తుంటారు.

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు న‌వ్వుల పాలు

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చేస్తాన‌ని గ‌త ఏడాది నుంచి ప‌వ‌న్ చెబుతున్నారు. అందుకోసం ఢిల్లీ బీజేపీని కూడా ఒప్పిస్తాన‌ని సినిమాటిక్ డైలాగులు ఎన్నో చెప్పారు. కానీ, ఆయ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ లు దొరికిన సంద‌ర్భాలు బ‌హు అరుదు. కేవలం న‌డ్డాతో మాత్రం క‌లుస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు జ‌న‌సేన పార్టీ ని వ్యూహాత్మ‌కంగా ఏపీలో బ‌తికించుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో మాదిరిగా రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ను ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నారు. కానీ, బీజేపీ మాత్రం ప‌వ‌న్ ప్ర‌తిపాద‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు రెడ్ సిగ్న‌ల్(BJP Strategy) వేస్తోంది. అవ‌స‌ర‌మైతే, జ‌న‌సేన పార్టీని వ‌దిలించుకునేందుకు క‌మ‌ల‌నాథులు సిద్ధ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. అందుకే, తిరుప‌తి వేదిక‌గా శ‌నివారం జ‌రిగే న‌డ్డా స‌భ‌కు, ఈనెల 11న విశాఖ కేంద్రంగా జ‌రిగే అమిత్ షా బ‌హిరంగ స‌భ‌కు ప‌వ‌న్ కు ఆహ్వానం లేదు.

Also Read : AP BJP : మాజీ మంత్రి కొడాలి నాని జైలుకే.. BJP కండీష‌న్స్ అప్లై..!

సాధార‌ణంగా ప్ర‌భుత్వ విజ‌యాల‌ను చెప్పుకోవ‌డానికి పొత్తులో ఉన్న పార్టీల‌ను ఆహ్వానించ‌డం ఆన‌వాయితీ. కానీ, తొమ్మిదేళ్ల న‌రేంద్ర మోడీ (Narendramodi)విజ‌యాల‌ను చెప్పుకునే వేదిక‌పై జ‌న‌సేన‌కు స్థానంలేకుండా పోయింది. గ‌తంలోనూ పలు రాజ‌కీయ స‌భ‌ల‌కు ప‌వ‌న్ ను(Pawan kalyan) దూరంగా పెట్టారు. ఇప్పుడు ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను చెప్పుకోవ‌డానికి నిర్వ‌హించుకునే స‌భ‌ల‌కు కూడా జ‌న‌సేనానికి ఆహ్వానంలేదు. ఇటీవ‌ల జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మోడీ స‌భ‌కు కూడా ప‌వ‌న్ ను పిల‌వ‌లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ ను దూరంగా పెడుతూ ఏపీలో బీజేపీ రాజ‌కీయాల‌ను(BJP Strategy) చేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోంది. అంటే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ప‌వ‌న్, చంద్ర‌బాబు కోరుకుంటోన్న పొత్తు కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, తాజా స‌భ‌ల ద్వారా పొత్తు సంకేతాలు బీజేపీ ఇస్తుంద‌ని ప‌లువురు భావించ‌డం గ‌మనార్హం.

Also Read : Janasena : ఉస్తాద్ పై బీజేపీ `లీనం`