Site icon HashtagU Telugu

Amit Shah : అమిత్ షా వ్యాఖ్యలతో అయోమయంలో కూటమి..

Amith Sha Waning

Amith Sha Waning

ఏపీ (AP)లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్న కూటమి నేతల్లో (NDA Alliance) ఆందోళన , భయం నింపారు బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)..మొదటి నుండి బిజెపి ఫై ముస్లింలు కాస్త వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ లో టీడీపీ , జనసేన పార్టీ బిజెపి తో చేతులు కలిపేసరికి చాలామంది ముస్లిం నేతలు కాస్త వెనుకడుగు వేశారు. కానీ చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు వారికీ భరోసా ఇవ్వడం తో వారంతా కూటమికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన అమిత్ షా..బిజెపి అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగం దీనిని అనుమతించదని అన్నారు. ఈ వ్యాఖ్యలపైముస్లింలు మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు కూటమి లో ఉన్న ముస్లింలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సమయంలో అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని నేతలంతా మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు వైసీపీ , కాంగ్రెస్ పార్టీలు తమకు సపోర్ట్ గా మాట్లాడుకుంటూ..ముస్లిం ఓట్లు దండుకునేందుకు ట్రై చేస్తున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం కచ్చింతంగా ఎన్నికల్లో కూటమి ఫై పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ఫలితాలు మార్చే విధంగా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది, మరి దీనిపై టీడీపీ – జనసేన నేతలు ముస్లిం సోదరులను ఎలా సర్దుమణిగిస్తారో చూడాలి.

Read Also : Vontimitta: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం, వేలాదిగా హాజరైన భక్తులు