AP : రేపటి టీడీపీ బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ న్యూస్ వైరల్

బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి పేరిట ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది

Published By: HashtagU Telugu Desk
TDP calls for State bandh on Monday

TDP calls for State bandh on Monday

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు ఏసీబీ కోర్ట్ (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో యావత్ తెలుగు ప్రజానీకం షాక్ కు గురవుతుంది. చంద్రబాబు ను అరెస్ట్ చేయడమే తప్పు అంటే..ఆయనను రిమాండ్ కు తరలించడం మరి దారుణమని..ఇది కేవలం జగన్ కక్ష్య సాధింపు చర్యగా భావిస్తున్నామని తెలుగు ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు రిమాండ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అలాగే రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్త బంద్ (AP Bandh)కు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది.

రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని టీడీపీ కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాగా అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ బంద్ కు సహకరించాలని నేతల కోరారు. అయితే ఈ బంద్ కు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర బిజెపి చీఫ్ పురందేశ్వరి (Purandeswari) పేరిట ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Chandrababu Remand : నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత – పవన్

చంద్రబాబు అరెస్ట్ ను బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని.. చంద్రబాబు కు పూర్తి సంఘీభావం (BJP Support) తెలుపుతున్నట్లు..అలాగే రేపు టీడీపీ తలపెట్టిన బంద్ కు బిజెపి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ ప్రెస్ నోట్ లో రాసి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని చంద్రబాబు కు సంఘీభావం తెలపాలని పురందేశ్వరి పిలుపునిచ్చినట్లు నోట్ వైరల్ గా మారడం తో..ఈ నోట్ ఫై పురందేశ్వరి స్పందించారు. ఫేక్ లెటర్ (Fake Latter) ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు.

Bjp Fake Pressnote

  Last Updated: 10 Sep 2023, 11:24 PM IST