Site icon HashtagU Telugu

BJP to TDP: టీడీపీలోకి బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు? మరో ఇద్దరు!

Bjp Leader Vishnukumar Raju To Tdp. Two More..

Bjp Leader Vishnukumar Raju To Tdp. Two More..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. కీలక నేతలకు పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా నేతల జంపింగ్స్ పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా టీడీపీ (TDP) నెలకో నేత ను పార్టీ లో చేర్చుకుంటూ సంచలనం సృష్టిస్తుంది.. డిశంబర్ లో ఆనం.. జనవరిలో కోటంరెడ్డి.. ఫిబ్రవరిలో కన్నా.. మార్చి నెలకు ఇద్దరు నేతలను లైన్లో పెడుతున్నట్లు సమాచారం వీరిలో ఒకరు విష్ణు కుమార్ రాజు (Vishnu Kumar Raju) కాగా. ఇప్పుడు కాషాయం పార్టీకి చెందిన మరో ముఖ్య నేత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. జనసేన – టీడీపీ పొత్తు వేళ ఈ నేత టీడీపీ ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ బీజేపీ (BJP) నుంచి మాజీ మంత్రి టీడీపీలో చేరతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సుదీర్గ రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ త్వరలో సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరటంతో ఇప్పుడు అక్కడ టీడీపీకి బలమైన నేత అవసరం.

గతంలో బీజేపీ (BJP) నుంచి కామినేని శ్రీనివాస్ 2014లో కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు 2014లో బిజెపిలో చేరి పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించిన ఏపీకి చెందిన ముఖ్య నేత మద్దతుగా సీటు దక్కించుకున్నారు. కామినేనికి అటు జనసేనాని పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యంలోనూ కామినేని పని చేసారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుంచి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ (TDP) అభ్యర్ధి జయమంగళం వెంకట రమణ చేతిలో ఓడిపోయారు.

కామినేని 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి పని చేసిన ఇద్దరు మంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ – చంద్రబాబు సమావేశాల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ (TDP) బయటకు వచ్చిన సమయంలో ఏపీలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి బీజేపీలోనే కామినేని కొనసాగుతున్నారు. బీజేపీలో ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నా..ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో దూరం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.అందులో భాగంగా.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని చెబుతున్నారు. టీడీపీ – జనసేన పొత్తు వేళ రెండు పార్టీల అధినేతలతో సత్సంబంధాలు ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే, బీజేపీతోనూ పొత్తు ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. దీంతో..బీజేపీ నేతల చేరిక పైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కన్నా ఎంట్రీతో ఆసక్తి ఉన్న ఇతర నేతలకు లైన్ క్లియర్ అయింది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనేది టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం పొత్తులు..చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కైకలూరు సీటు వచ్చే ఎన్నికల్లో కామినేనికి కేటాయించేందుకే జయమంగళం వెంకటరమణకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వలేదనే వాదన ఉంది. ఇప్పుడు వెంకట రమణ వైసీపీలో చేరటంతో అక్కడ కామినేని కి రూట్ క్లియర్ అయింది. ఏపీలో వైసీపీతో మినహా ఇతర పార్టీల నేతలతో కామినేనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా నియోజకవర్గంలోనూ టీడీపీ – జనసేన పొత్తు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో.. వ్యూహాత్మకంగానే కామినేని టీడీపీలో చేరటం.. పార్టీ అధినాయకత్వం కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమతో పొత్తుకు అంగీకరించని బీజేపీ కి తన సత్తా ఏంటో చూపించే విధంగా బీజేపీ నేతలు వరుసగా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్న వేళ..కమలం పార్టీ ఈ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తుదనేది చూడాలి.

Also Read:  TDP Vizag Politics: విశాఖ సమ్మిట్ పై టీడీపీ కౌంటర్