MadhaviLatha : వందే భారత్ ట్రైన్‌లో మాదవీలత హల్ చల్..

Madavi Latha : తన అనుచరులు, కొంత మంది నేతలతో కలసి వందేభారత్ ట్రైన్ లో భజనలు చేశారు

Published By: HashtagU Telugu Desk
Madavilatha Tirumala

Madavilatha Tirumala

తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ..ఎంతో పాపం జరిగిందని వాపోతున్నారు. రాజకీయ పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ ఘటన ఫై సీరియస్ అయ్యింది. ప్రభుత్వం సిట్ ను సైతం ఏర్పాటు చేసింది. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. హిందు ధర్మానికి అన్యాయం జరిగితే మాట్లాడటం నేరమా.. అంటూ ఎమోషన్ అయ్యారు. తెలంగాణ కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం పవన్ కు సపోర్ట్ గా నిలిచారు. ఇలా ప్రతి ఒక్కరు లడ్డు వివాదం ఫై స్పందిస్తూ వస్తున్నారు. మరోవైపు ఏపీవ్యాప్తంగా అన్ని ఆలయాలలో కూడా శుద్ది కార్యక్రమం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇక బిజెపి నేత మాధవీలత (MadhaviLatha ) తిరుమల లడ్డు వివాదంపై ఇటీవల చిలుకూరు వెళ్లి అక్కడ పూజలు సైతం చేశారు. తిరుమల లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటి లడ్డుపై వివాదం తలెత్తడం ఆందోళన కల్గించే అంశమన్నారు. ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు చెందిన అంశమన్నారు. ఇక ఇప్పుడు వందే భారత్ ట్రైన్ (VandeBharat Train) లో తిరుమలకు పయనమయ్యారు. తన అనుచరులు, కొంత మంది నేతలతో కలసి వందేభారత్ ట్రైన్ లో భజనలు చేశారు. సహచర భక్త బృందంతో కలిసి ఆ గోవిందుడి నామం జపిస్తూ.. వెంటేశ్వర స్వామివారి పాటలు పాడుతూ భజన చేస్తూ వందే భారత్‌తో రైలులో మాధవీలత తిరుమలకు బయలుదేరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Last Updated: 26 Sep 2024, 03:19 PM IST