Andhra Pradesh: పులి + కర్ర = టీటీడీ

అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు తిరుమల రోడ్లపైకి ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నదని ఆరోపించారు.

Andhra Pradesh: అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు తిరుమల రోడ్లపైకి ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నదని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపితే వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే వాళ్ళ జోలికి వెళ్లరని విమర్శించారు. అడవులని నరికివేయడం ద్వారానే వన్యమృగాలు అడవులను దాటి బయటకు వస్తున్నాయని చెప్పారు. తిరుమలకు కాలినడకన వెళ్లే వారికి కర్ర ఇస్తామనడం అది భక్తుల్ని అవమానించడమేనని మండిపడ్డారు. భక్తులకు భద్రత కల్పించాల్సింది పోయి కర్ర ఇస్తామనడం ఏంటని ధ్వజమెత్తారు. పులి, కర్ర లా టీటీడీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. తిరుమల విషయంలో సీఎం వైఎస్ జగన్ స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండేళ్లుగా భక్తుల జాగ్రత్తల విషయంలో తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండ్రోల క్రితం తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలు విడిచింది. పచ్చటి కుటుంబంలో చిన్నారి మరణం దుఃఖాన్ని మిగిల్చింది. చలాకీగా ఉండే లక్షిత చిరుతకు బలవ్వడం ముమ్మాటికీ టీటీడీ తప్పిదమేనని చెప్తున్నారు. కాగా చిన్నారి మృతితో అలర్ట్ అయిన టీటీడీ భక్తులకు జాగ్రత్త కల్పించే విషయంలో అటువైపు వెళ్లే వారికి కర్ర ఇస్తామనడం నవ్వులపాలు చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కర్రకి చిరుత భయపడటం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: Canada: ఉత్తర అమెరికాను అతలాకుతులం చేస్తున్న కార్చిచ్చు.. దెబ్బకు నగరం మొత్తం ఖాళీ?