Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్‌షా.. విజయశాంతి ప్రెస్‌మీట్

Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.

  • Written By:
  • Updated On - November 18, 2023 / 08:18 AM IST

Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు మూడు భారీ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తొలుత గద్వాలకు అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడ తలపెట్టిన సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరవుతారు. అనంతరం నల్గొండకు వెళ్తారు. అక్కడ పార్టీ నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 తర్వాత వరంగల్​ సభకు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం వరంగల్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. కట్రీయా హోటల్​లో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. రాత్రి 8 తర్వాత తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు.

  • ఇవాళ సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ పాల్గొంటారు. ప్రతిరోజూ సగటున మూడు సభల్లో పాల్గొంటున్న కేసీఆర్.. ఇవాళ (శనివారం) కేవలం ఒక సభలో పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
  • ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగ్స్‌లో ప్రసంగిస్తారు.
  • ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రెస్ మీట్ ఉంది.
  • ఇవాళ భైంసాలో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారు.
  • వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. అది బంగ్లాదేశ్‌ తీరం దాటింది. మరోవైపు దక్షిణ అండమాన్‌ వద్ద సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఏపీ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై ఇవాళ, రేపు  టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి.
  • తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
  • పంచమి సందర్భంగా తిరుమలలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీవారి ఆలయం నుంచి సారే ఉరేగింపు జరుగుతుంది.
  • తిరుమలలో ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది.  రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం ఉంది. 7 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన(Whats Today)  నిర్వహిస్తారు.

Also Read: Panda Envoys : చైనా, అమెరికా మధ్యలో పాండా.. ఎందుకు ?