Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో నంబర్ 1 ప్లేసులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిలిచింది. ఆ పార్టీకి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2120 కోట్ల విరాళాలు అందగా, వాటిలో దాదాపు రూ.1300 కోట్లు (61 శాతం) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరినవే. గతేడాది విరాళాలు సహా అన్ని వనరులను కలుపుకొని బీజేపీకి మొత్తం రూ. 2360.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈమేరకు 2022-23 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ అందించింది. అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.1917 కోట్ల ఆదాయం రాగా.. అందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాలు రూ.1775 కోట్లు(Electoral Bonds) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
బీజేపీ అభ్యర్థులకు రూ.76 కోట్లు
గత ఏడాది బీజేపీకి వడ్డీల రూపంలో రూ. 237 కోట్ల ఆదాయం లభించగా.. అంతకుముందు ఏడాది (2021-22)లో రూ.135 కోట్లే వడ్డీ ఆదాయం సమకూరింది. ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లు, విమానాల వినియోగానికి బీజేపీ పెట్టే వార్షిక ఖర్చు రూ.117 కోట్ల నుంచి రూ.78 కోట్లకు తగ్గింది. ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా బీజేపీ గతేడాది మొత్తం రూ. 76.5 కోట్లు చెల్లించింది. వాస్తవానికి ఈ ఖర్చు 2021-22లోనే అత్యధికంగా రూ. 146.4 కోట్లుగా ఉంది.
Also Read : Pakistan Earthquake: పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..!
కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 171 కోట్లు వచ్చాయి. అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 236 కోట్లు సమకూారాయి.
సమాజ్ వాదీ
సమాజ్ వాదీ పార్టీకి 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్ల విరాళాలు వచ్చాయి. 2022-23లో ఈ బాండ్ల ద్వారా సమాజ్‌వాదీకి విరాళాలు ఏవీ రాలేదు.
టీడీపీ
టీడీపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గతేడాది రూ.34 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నా ఈ పార్టీ విరాళాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021 – 22) కంటే 10 రెట్లు పెరగడం గమనార్హం.