త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే టిడిపి – జనసేన పార్టీ లు తమ అభ్యర్థుల తాలూకా మొదటి లిస్ట్ ను ప్రకటించగా..ఈరోజు రెండో లిస్ట్ ను ప్రకటించబోతున్నాయి. టీడీపీ 25 మంది అసెంబ్లీ అభ్యర్థులతోపాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. ఇటు బిజెపి కూడా తమ మొదటి లిస్ట్ ను ప్రకటించాలని భావిస్తుంది. ఇప్పటికే పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలు ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్థానాల్లో BJP పోటీ చేయాలనీ డిసైడ్ అయ్యిందట. విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు, కైకలూరు- సోము వీర్రాజు, జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి, బద్వేలు – సురేశ్, ధర్మవరం – వరదాపురం సూరి, ఆదోని- కొనిగరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి సురేంద్ర మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా వీరేనా అనేది తెలియాల్సి ఉంది.