Amaravati: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!

అమరావతి రైతులకు ఏపీ బీజేపీ భేషరుతు మద్దతు ప్రకటించింది. అమిత్ షా ఆదేశం మేరకు రాజధాని రైతుల తో బీజేపీ నేతలు మహా పాదయాత్రలో నడిచారు.

  • Written By:
  • Updated On - November 21, 2021 / 08:42 PM IST

అమరావతి రైతులకు ఏపీ బీజేపీ భేషరుతు మద్దతు ప్రకటించింది. అమిత్ షా ఆదేశం మేరకు రాజధాని రైతుల తో బీజేపీ నేతలు మహా పాదయాత్రలో నడిచారు. దీంతో ఇక మూడు రాజధానులు బిల్లు రద్దు చేస్తారని రైతులు విశ్వసిస్తున్నారు. టీడీపీ తో కలిసి నడవడానికి బీజేపీ సిద్ధపడుతున్న సంకేతంగా పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఈ పరిణామం రాబోవు రోజుల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుకు నిదర్శనంగా భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం , అమరావతి రాజధాని పై ఎదో ఒక నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు రైతులతో ముందుకు కదలటం రాజధాని అమరావతి ఖాయం గా భావిస్తున్నారు. వాస్తవంగా తొలి నుంచి ఏపీ బీజేపీ అమరావతికి మద్దతుగా ఉంది. కానీ రైతులు చేసిన ఉద్యమాల్లో పెద్దగా పాల్గొన లేదు. ఇప్పుడు ప్రత్యక్షం గా బీజేపీ రైతులతో నడిచారు. పైగా అమిత్ షా రంగంలోకి దిగడంతో సరికొత్త ఉత్సహం రాజధాని రైతుల్లో కనిపిస్తుంది.
రైతుల మహా పాదయాత్ర పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార వైఖరిని బీజేపీ ఖండించింది. రైతులే కాకుండా ‘మూడు రాజధానుల’ భావనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారందరి ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం మానుకోవాలని వైసీపీ సర్కారును డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (ఏపీ)కి అమరావతి రాజధానిగా ఉండాలన్న పార్టీ వైఖరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి పునరుద్ఘాటించారు.అనేక సంస్థలను మంజూరు చేయడంతో పాటు దాని అభివృద్ధికి కేంద్రం ₹ 2,500 కోట్లు విడుదల చేయదాన్ని గుర్తు చేశారు.వికేంద్రీకరణ ముసుగులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (వైఎస్‌ఆర్‌సి) ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి వైదొలగకపోతే ఈ పాటికి నగరంగా రూపుదిద్దుకునెదని అన్నారు. సో..బీజేపీ రాజకీయ కోణం నుంచి రైతు యాత్రను వాడుకోవాలని చూస్తుంది. కానీ రైతులు ఇక రాజధాని అమరవతే అనే ఫీల్ లో ఉన్నారు. బీజేపీ అనుకుంటే కేంద్రం నుంచి గెజిట్ వస్తుంది. అమరావతి రాజధాని పై అధికారిక ప్రకటన చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ యాత్రను రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ చూస్తుంది అనేది కొందరి అభిప్రాయం. బీజేపీ సరికొత్త యాత్ర వెనుక షా రాజకీయ ఎత్తులను భవిష్యత్ తేల్చాలి.