Site icon HashtagU Telugu

BJP Alliance TDP-Janasena : వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత – బిజెపి

Tdp Jsp Bjp

Tdp Jsp Bjp

టీడీపీ – జనసేన ఉమ్మడి కూటమి (BJP Alliance) తో బిజెపి పొత్తు ఉంటుందా..లేదా అనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ (Shiva Prakash) తెలిపారు. గత రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు అమరావతి (Amaravathi) లో సమావేశాలు జరుపుతూ వచ్చారు. ఈరోజుతో ఈ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

125 మందికి పైగా నేతలతో శివప్రకాశ్ వరుసగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసి… పార్టీ బలాలపై సమీక్ష నిర్వహించారు. ఏ ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా టీడీపీ – జనసేన పార్టీలతో పొత్తులపై పార్టీ నేతలతో చర్చించారు. రాష్ట్ర నేతలు పొత్తులపై తమ అభిప్రాయాలను శివప్రకాశ్ కు వివరించారు. పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన నేతలకు స్పష్టం చేసారు. ఏపీలో బీజేపీ పొత్తులపై వారం రోజుల్లోగా స్పష్టత వస్తుందని తెలియజేసారు.

ప్రస్తుతం మాత్రం టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా 118 స్థానాలను ప్రకటించాయి. వీటిలో 94 స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుండగా..జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక 94 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను బాబు ప్రకటించగా..పవన్ మాత్రం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించారు. మరి మిగతా స్థానాలు బిజెపి కి కేటాయిస్తుందా..లేక వారే పోటీ చేస్తారా..? అనేది బిజెపి పొత్తు బట్టి ఉంటుంది.

Read Also : Vegetable Soup: ఈ ఆకుకూరల సూప్ తో ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గాల్సిందే?