BJP Alliance TDP : టీడీపీ కూటమితో బిజెపి పొత్తు ఫిక్స్..మరికాసేపట్లో ప్రకటన

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 12:08 PM IST

మొత్తానికి టీడీపీ కూటమి తో బిజెపి (BJP Alliance TDP) జత కలిసింది. బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పొత్తుకు సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన అధినేత పవన్..ఇప్పుడు బిజెపి తో పొత్తు పెట్టుకోవడం వెనుక కూడా ఎంతో కష్టపడ్డారు. తమ సీట్లను తగ్గించుకొని కూడా బిజెపి కి సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

గత కొద్దీ రోజులుగా సీట్లకు సంబంధించి మూడు పార్టీలలో చర్చలు నడుస్తుండగా..దీనిపై ఏదోకటి తేల్చాలని చెప్పి మొన్న సాయంత్రం చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఢిల్లీకి వెళ్లి.. అమిత్‌షాతో సమావేశమయ్యారు. తమకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వాలని అమిత్‌షా ప్రతిపాదించారు. 8 నుంచి 10 వరకు ఇస్తే బాగుటుందని , 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని అందుకే ఎక్కవ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనికిపై ‌స్పందించిన చంద్రబాబు… నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని అన్నారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఇలా రెండు రోజులుగా సీట్ల ఫై చర్చలు జరిపిన మూడు పార్టీల నేతలు..ఫైనల్ గా మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలని ఫిక్స్ అయ్యారు.

బీజేపీ కూడా గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయనతో కలిసి పనిచేయడానికి ముగ్గు చూపించింది. గతంలో వాజ్‌పేయీ హయాంలో కానీ గత మోడీ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తప్పితే, ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏదీ కోరలేదని, ఆ విషయం బీజేపీ అగ్రనేతలకూ తెలుసు. అందుకే 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగినప్పటికీ మళ్లీ కలిసి పనిచేద్దామని ఆహ్వానించినట్లు ఉదహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే మూడు పార్టీలు ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో అందరూ ఒకే మాట ఫై మాట్లాడారు. అందుకే జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఒక సీటు అటూ ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Read Also : Jagan Target : అధినేతల ఓటమి పైనే సీఎం జగన్ ఫోకస్ అంత..