Site icon HashtagU Telugu

BJP: 30 న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ “రైతు హామీల సాధన దీక్ష”

bjlp leader maheshwar reddy sensational comments on rythu bharosa

bjlp leader maheshwar reddy sensational comments on rythu bharosa

Rythu Hamila Sadhana Diksha: ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష చేయనుంది. ఈ మేరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రకటన చేశారు. “రైతు హామీల సాధన దీక్ష” ఈ నెల 30న చేస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేసిందని ఫైర్‌ అయ్యారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు… కానీ చేయలేదని నిప్పులు చెరిగారు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మీకు, మంత్రుల మధ్య ఉన్న గ్యాబ్ తెలుస్తుందన్నారు. రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు… కమిటీ రిపోర్ట్ బయట పెట్టడం లేదన్నారు. ఉపాధి హామీ కూలీలను, కౌలు రైతులను మోసం చేశారన్నారు. వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని ఉత్తం కుమార్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. సన్న వడ్ల కు మార్కెట్ లో ఎక్కువ ధర ఉన్నది.. మీకు ఎవరు ఇవ్వరన్నారు.

Read Also: KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు

రుణ మాఫీ సగం మందికి చేయలేదని ఆగ్రహించారు. ఎక్కడకు వెళితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు…రాహుల్ గాంధీ చేతుల మీదుగా రైతు డిక్లరేషన్ చేయించారని మండిపడ్డారు. రుణమాఫీ పై రేవంత్ రెడ్డీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు రుణమాఫీ జరగలేదు అని అంటున్నారని గుర్తు చేశారు. బోనస్ అనేది బోగస్ అన్నారు. ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో ఈ నెల 30 న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష ఉంటుందన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు.

Read Also: Tiruamla Laddu : లడ్డులో ‘గుట్కా ప్యాకెట్ ‘ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ