వైసీపీ యువ నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీఎం జగన్ పై ఉన్న ప్రేమను,అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు. డిసెంబర్ 21వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ఆయనకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిదార్థా రెడ్డి కూడా సీఎం జగన్ కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాగర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ ప్లకార్డును ప్రదర్శించారు.| లైవ్ అడ్వంచర్ డైరెక్టర్ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు బైరెడ్డి స్కూబా డైవ్ చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Deep Waters: బైరెడ్డి స్టైలే వేరబ్బా.. జగన్ కి వినూత్నంగా బర్త్ డే విషేష్ చెప్పిన బైరెడ్డి

Whatsapp Image 2021 12 20 At 18.48.33 Imresizer