Site icon HashtagU Telugu

Bill Gates’ Letter : సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ

Bill Gates Chandrababu

Bill Gates Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandrababu)కు బిల్ గేట్స్ (Bill Gates) లేఖ రాసిన విషయం రాష్ట్ర రాజకీయాల్లో మరియు పాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మరియు ఆయన బృందం పాల్గొనగా,అక్కడ జరిగిన సంభాషణలు, ఒప్పందాలపై బిల్ గేట్స్ తన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలను ఆయన ప్రశంసించారు.

Kondareddypalli : ఆంజనేయ స్వామి ఆలయంలో ఆసక్తికర సన్నివేశం..నవ్వుకున్న మంత్రులు

లేఖలో పాలనలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు దృక్పథాన్ని హైలైట్ చేశారు. రియల్ టైమ్ డేటా సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయాలు, హ్యూమన్ కాపిటల్ అభివృద్ధి వంటి అంశాల్లో సీఎం చూపిన దృక్పథం అభినందనీయం అని పేర్కొన్నారు. ఆయన విజన్ ప్రపంచంలోని అల్పాదాయ దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం కలసి చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఆరోగ్య రంగంలో డిజిటలైజేషన్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయ వృద్ధి వంటి కీలక అంశాల్లో రాష్ట్రం గొప్ప పురోగతిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తదుపరి భారత పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ వచ్చేటప్పుడు ఈ భాగస్వామ్యం ద్వారా ఎలా అభివృద్ధి సాధించామో ప్రత్యక్షంగా చూడగలమన్న నమ్మకాన్ని లేఖలో వెల్లడించారు.