టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 43 రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ రోజు నుంచి ఏపీ తెలంగాణలోనే కాకా, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆయన అభిమానులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. చంద్రబాబు కట్టిన ఐటీ కంపెనీ బిల్డింగ్‌ల వద్ద తమ మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఐటీని అభివృద్ది చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అంటూ టెక్కీలు తమ మద్దతు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రజలకు తెలిసేలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు చేపట్టారు. చలో రాజమండ్రి పేరుతో రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. బ్లాక్ డే ఫ్రైడే పేరుతో ఆఫీసులకు బ్లాక్ డ్రెస్‌లతో వెళ్లారు. ఇటు మెట్రో రైల్‌లో బ్లాక్ డ్రెస్‌లు ధరించి ప్రయాణించారు. వివిధ రూపాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు శ్రీకారం చుడుతున్నారు. తమకు ఉపాధి, భవిష్యత్‌ను ఇచ్చిన విజనరీ లీడర్‌కు కృతజ్ఞత తెలిపుతూ భారీ సభకు ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఆదివారం ఈ భారీ సభను నిర్వహించేందుకు ఐటీ ఉద్యోగులు ప్లాన్ చేస్తున్నారు. లక్ష మందితో ఈ సభను నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సభకు సంబంధించి పోలీస్ పర్మిషన్‌తో పాటు.. గ్రౌండ్ కోసం ఐటీ ఉద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. త్వరలోనే సభకు సంబంధిచిన వివరాలను ఐటీ ఉద్యోగులు వెల్లడించనున్నారు.
Also Read: Poonam Kaur : చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని నటి పూనం కౌర్ పూజలు