ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, వైసీపీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల జగన్ పాలనను పరిశీలించిన తర్వాత, ఆ పార్టీ నేతలు ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదు అనుకొని, పక్క చూపులు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు కీలక నేతలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే, మరికొందరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొంతమంది నేతలు అయితే, పార్టీలో ఉన్నారో లేక లేరో అన్నది కూడా తెలియదు. వారు పార్టీతో సన్నిహిత సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇంతలోనే, కొన్ని కీలక నేతలు వైసీపీని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, జయ మంగళ వెంకటరమణ శనివారం తన రాజీనామాను సమర్పించారు. గత కొంత కాలంగా, వైసీపీపై, ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి వైఖరి మీద కూడా నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ ఇవాళ(శనివారం) రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పారీల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే త్వరలోనే మరికొంత మంది నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ ఒకటి, రెండు తేదీల్లో రాజీనామాలు ఉంటాయని మనకు అందుతున్న సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.