వైసీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna)కి భారీ దెబ్బ తగిలింది. ఆయనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Salman Khan : తన ప్రేమ జీవితంపై మనసు విప్పిన బాలీవుడ్ కండల వీరుడు
ఇదే వివాదంలో మీడియా వర్గాల్లోనూ కలకలం రేగింది. ఓ టీవీ డిబేట్‌లో జర్నలిస్టు కృష్ణంరాజు, డిబేట్ మోస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అమరావతిపైనా, అక్కడి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కూడా పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేశారు. అయితే ఈ అంశంపై స్పందించిన సజ్జల వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీసాయి.
సజ్జల రామకృష్ణారెడ్డిపై కులవివక్షకు సంబంధించిన పదాలను వాడారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. దీనిపై అమరావతి మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ పరువు నష్టం కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో ఏం వెలుగులోకి వస్తుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.