వైసీపీ ఎంపీ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే ఎంపీ మిథున్ రెడ్డి(P. V. Midhun Reddy) కి మద్యం కుంభకోణం కేసు(AP Liquor Case)లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన రూ.4,000 కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సీఐడీ (CID) అభిప్రాయపడింది. తన అరెస్ట్ భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు విచారణ అనంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయకుండా తిరస్కరించింది.
IndiGo : ‘మాన్‌సూన్ సేల్’ను ప్రకటించింన ఇండిగో..రూ.1,499 ధరకే విమాన ప్రయాణం
సీఐడీ వివరాల ప్రకారం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం సరఫరా విధానాన్ని ఆన్‌లైన్ నుంచి మ్యాన్యువల్‌కు మార్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపించారు. ఈ మార్పు వల్ల కొన్ని కంపెనీలకు ముడుపులు తీసుకుని మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 3,500 కోట్లు నష్టం వాటిల్లిందని కోర్టులో తెలిపారు. అంతేకాక మిథున్ రెడ్డి ఇప్పటికే విచారణకు సహకరించడం లేదని, ఆయనపై 8 క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్టు వివరించారు.
మిథున్ రెడ్డి తరఫున వాదించిన సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. మిథున్ రెడ్డికి స్కాంకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ మద్యం విధానంలో ఆయనకు పాత్ర లేదని స్పష్టం చేశారు. కనీసం షరతులతో అయినా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరినా, హైకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. ఈ తీర్పుతో మిథున్ రెడ్డి తీవ్ర సమస్యల్లో పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.