Site icon HashtagU Telugu

Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామ‌కు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!

Ambati Rambabu

Safeimagekit Resized Img (3) 11zon

Ambati Rambabu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు బిగ్ షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అంబటికి ఓటు వేయొద్దని సొంత అల్లుడు గౌతమ్ ఓటర్లకు సూచించారు. అంతేకాకుండా అంబటి రాంబాబు లాంటి ఎదవన్నర ఎదవలకు ఓటు వేయొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక సత్తెనపల్లి ఓటర్లు డిసైడ్ అవ్వాలని గౌత‌మ్ విడుద‌ల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంత్రి అంబ‌టి రాంబాబు స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అంబ‌టికి మొద‌ట్నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఉంది. సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం అంబ‌టికి స‌త్తెన‌ప‌ల్లి టికెట్ ఇస్తే ఓడిస్తామ‌ని హెచ్చ‌రించారు కూడా. అయితే ఆ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ స‌త్తెన‌ప‌ల్లి సీటును అంబ‌టి రాంబాబు బంధువుల్లో ఒక‌రికి ఇవ్వాల‌ని చూసిన‌ట్లు తెలిసింది. అయితే స‌త్తెన‌ప‌ల్లి కొత్తవారిని నిల‌బ‌డితే వైసీపీ ఓడిపోతుంద‌ని భావించిన జ‌గ‌న్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా స‌త్తెన‌ప‌ల్లి సీటుపై ఉత్కంఠ పెంచి చివ‌ర‌కు మంత్రి అంబ‌టి రాంబాబుకే సీటు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అంబ‌టి వ్య‌తిరేకుల్లో అసంతృప్త జ్వాల‌లు భగ్గుమ‌న్నాయి. ఎలాగైనా అంబ‌టిని ఓడిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే అంబ‌టి వ్య‌తిరేకులంద‌రూ టీడీపీ తీర్థం పుచ్చుకుని అంబ‌టి ఓట‌మి కోసం ప‌నిచేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: కూట‌మి 130 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంది: పవన్ కల్యాణ్

మంత్రి అంబ‌టి తొలి నుంచే కార్య‌క‌ర్త‌లను ప‌ట్టించుకోలేదని, స‌మ‌స్య‌లు చెప్పుకునే ఛాన్స్ కూడా లేద‌ని వైసీపీ నేత‌లే ఆరోప‌ణ‌లు చేశారు. అయితే అంబ‌టి మాత్రం సత్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌లు త‌న‌వైపే ఉన్నార‌ని, భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌బోతున్నాను అని స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చారు.

ఇలాంటి స‌మ‌యంలోనే అంబ‌టి సొంత అల్లుడు.. మామ‌కు ఓటు వేయొద్దు అని వీడియో రిలీజ్ చేయ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాకుండా అంబటి రాంబాబుపై ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సొంత అల్లుడే సొంత అల్లుడే అంబ‌టి రాంబాబుకు ఓటు వేయొద్దు అంటున్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన క్యారెక్టర్ ఎంత నీచమో అని కామెంట్లు పెడుతున్నారు. మ‌రీ అల్లుడు గౌత‌మ్ చేసిన వీడియోపై అంబ‌టి రాంబాబు ఏం చెప్తారో..? ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూద్దాం..!

We’re now on WhatsApp : Click to Join

 

Exit mobile version